వైరల్ : “RRR” సాంగ్ ని స్పెషల్ పెర్ఫామెన్స్ ఇచ్చిన పవన్ తనయుడు.!

Published on May 24, 2022 11:00 am IST

ఈ ఏడాదికి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. అయితే ఈ సినిమా ఇపుడు ఓటిటి లో కూడా వచ్చి అదరగొడుతుండగా లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఇంకో పక్క పవర్ స్టార్ మరియు మెగా అభిమానులు మరో విధంగా కూడా ఆనందంగా ఉన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ నిన్నటితో తన స్కూల్ గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసుకోగా ఆ ఈవెంట్ కి గాను రేణు దేశాయ్ తో పాటుగా పవన్ పాల్గొనడం అలాగే తమ ఫ్యామిలీ తో కలిసి ఫోటో దిగడంతో ఆ ఫ్రేమ్ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు ఇదే ఈవెంట్ లో అకీరా RRR సినిమాలోని దోస్తీ సాంగ్ ని పియానో పై వాయించి తన మరో టాలెంట్ ప్రదర్శితం చేసాడు. దీనితో ఈ వీడియో ఇప్పుడు పవన్ అభిమానుల్లో మంచి వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :