పవన్ “వీరమల్లు” ఎట్టి పరిస్థితుల్లో దిగేది అప్పుడే.?

Published on May 22, 2022 7:02 am IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు భారీ సినిమాలు ఓకే చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో అయితే ఫస్ట్ రేస్ లో ఉన్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు 50 శాతంకి పైగా కంప్లీట్ అయ్యినట్టు తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ఈ సినిమాపై పలు ఊహించని రూమర్స్ వైరల్ అవుతున్నాయి కానీ వాటిలో నిజం లేదని తెలుస్తోంది.

అలాగే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై టాక్ వినిపిస్తోంది. మేకర్స్ అయితే ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపాలని చూస్తున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :