మరో కొత్త సినిమాకు సైన్ చేసిన పవన్ కళ్యాణ్ !

20th, March 2017 - 04:41:37 PM


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరుస పెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నాడు. తాజాగా దర్శకత్వంలో ‘కాటమరాయుడు’ షూటింగ్ పూర్తి చేసిన ఆయన త్వరలో తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు. ఇక తమిళ దర్శకుడు ఆర్టీ నీసన్ తో కూడా ఒక ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరుపుకుని లిస్టులో చేరిపోయింది. ఇలా ఈ వరుస మూడు ప్రాజెక్టులతోనే ఆనందానికి గురైన ఫ్యాన్స్ కు మరింత ఆశ్చర్యం కల్గిస్తూ పవన్ మరో సినిమాకి ఒప్పుకున్నారని సినీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే ‘కందిరీగ’ ఫేమ్ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చడంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రం కూడా తమిళ సినిమాకి రీమేక్ గా ఉండనుందని దీన్ని మైత్రి మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుందని అంటున్నారు. అయితే ఈ వార్తపై పవన్ కు సంబందించిన వ్యక్తుల నుండి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కనుక పూర్తి విశ్వసనీయ సమాచారం బయటకు రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.