‘కాటమరాయుడు’ కోసం విశ్రాంతి లేకుండా పని చేస్తున్న పవన్ !

28th, February 2017 - 05:15:10 PM


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాక సినిమాలకు సరిగా న్యాయం చేస్తారో చేయరో అని అందరూ అనుమానపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు రెండింటినీ చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక సినిమా చేస్తున్న ఆయన మరో రెండు మూడు సినిమాల్ని లైన్లో పెట్టి అదే సమయంలో 2019 ఎన్నికలకి కూడా సిద్ధమవుతున్నారు. ఇందు కోసం ఆయన చాలానే కష్టపడుతున్నారు. గ్యాప్ లేకుండా షూటింగ్, పొలిటికల్ మీటింగ్స్ కు హాజరవుతున్నారు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘కాటమరాయుడు’ సినిమా డెడ్ లైన్ దగ్గరపడుతుండంతో పవన్ టాకీ పార్ట్ పూర్తి చేసి తన పాత్రకు నిన్న అర్థ రాత్రి నుండి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. ఈ డబ్బింగ్ ప్రక్రియ ఈరోజు అర్థ రాత్రి కూడా కొనసాగనుంది. ఇది పూర్తవ్వగానే పవన్ టీమ్ తో కలిసి పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఇకపోతే మార్చి నెల మధ్యలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి 24వ తేదీన సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.