పుట్టినరోజు వేడుకలకు దూరంగా పవన్ కళ్యాణ్

pawan-kal
సాధారణంగా సినీ సెలబ్రిటీలు చాలా మంది తమ పుట్టినరోజుని అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున జరుపుకుంటుంటారు. మరికొందరు భారీగా కాకపోయినా ఓ మాదిరిగా అయినా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతిసారి తన పుట్టినరోజుని అసలు ఎటువంటి హడావుడి లేకుండా గడిచిపోనిస్తారు. స్వతాహాగా హంగు ఆర్బాటాలకు, వేడుకలకు దూరంగా ఉండే పవన్ పుట్టినరోజునాడు కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులు అందరికీ దూరంగా వెళ్ళిపోతారు.

కనీసం తానెక్కడున్నది కూడా ఎవరికీ తెలీనివ్వరు, విషెస్ కూడా అందుకోరు. ఈసారి పుట్టినరోజుకి కూడా అలాగే చేస్తున్నారు. రెండురోజుల పాటు అందరికీ దూరంగా ఉంటునున్నారు. ఆ తరువాత వచ్చి రాజకీయ, సినిమాపరమైన పనులు చక్కబెట్టుకుంటారు. పవన్ లోని ఈ భిన్న మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న అభిమానులు కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారే తప్ప హైదరాబాద్ వచ్చి ఆయన్ను కలవడానికి ప్రయత్నించరు. ఇకపోతే ప్రస్తుతం డాలి డైరెక్షన్లో ‘కాటమరాయుడు’ చిత్రం చేస్తున్న పవన్ ఆ తరువాత త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా చేయనున్నారు.