వందల మందితో ‘వీరమల్లు’ ఫైట్

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి చారిత్రక నేపథ్యంలో చేస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రారంభమైన మొదట్లో సినిమా మీద ప్రేక్షకులకు పెద్దగా అంచనాలు లేవు. కానీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలయ్యాక మాత్రం లెక్కలు మారాయి. వీరమల్లుగా పవన్ లుక్ అదిరిపోవడంతో అభిమానులే సప్రైజ్ ఫీలయ్యారు. బిజినెస్ వర్గాలైతే ఆలస్యం చేయకుండా సినిమా హక్కుల్ని దక్కించుకోవాలని తొందరపడుతున్నాయి. ఈమధ్యనే రీస్టార్ట్ అయింది సినిమా చిత్రీకరణ.

ఈ సినిమా కోసమే 150 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా చార్మినార్ సెట్ నిర్మించారు. తెలుగు సినిమాల్లో ఇంతవరకు ఎవ్వరూ వేయనంత భారీ సెట్ ఇది అంటున్నారు. గ్రీన్ మ్యాట్ వేసి విఎఫ్ఎక్స్ ద్వారా సృష్టించగలిగినప్పటికీ నిర్మాత, దర్శకుడు రియలిస్టిక్ లుక్ కోసం భారీ వ్యయంతో ఒరిజినల్ చార్మినార్ కొలతలతో సెట్ వేస్తున్నారు. ఈ నెల 27 నుండి ఇందులో షూటింగ్ జరుగుతుందట. ప్రధానంగా ఫైట్ సీక్వెన్సెస్ భారీగా ఉండబోతున్నాయట. ఇందుకోసం వందలమంది ఫైటర్లను తీసుకొస్తున్నారట. ఈ పోరాట సన్నివేశాల్లో సినిమాకు హైలెట్ కాబోతున్నాయని చెబుతున్నారు చిత్ర సన్నిహిత వర్గాలు.

Exit mobile version