అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన పవన్ !

పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఈ నెల 10న భారీ ఎత్తున విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తార స్థాయి అంచనాలు నడుమ వస్తున్న ఈ చిత్రం విడుదలతోనే బాహుబలిని మించిన రికార్డ్ సృష్టించనుంది. చిత్రం ఏకంగా 547 కు పైగా స్క్రీన్లలో రిలీజ్ కానుంది. దీంతో ఓపెనింగ్స్ భారీ స్థాయిలోనే ఉండనున్నాయి.

తన చిత్రాన్ని ఇంతలా ఆదరించి, గొప్ప రిలీజ్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, అందుకు ఓవర్సీస్ ప్రేక్షకుల్లకు తన కృతజ్ఞతలని పవన్ వీడియో ద్వారా స్వయంగా తెలిపారు. అలాగే యూఎస్ లో ఉంటున్న భారతీయులకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్న ఇక్కడి భారతీయులు సిద్ధంగా ఉంటారని కూడా అన్నారు. ఇకపోతే 9వ తేదీ రాత్రి నుండే ప్రీమియర్లు ప్రదర్శించడానికి అన్ని చోట్ల సన్నాహాలు జరుగుతున్నాయి.

వీడియో కొరకు క్లిక్ చేయండి