సాయి తేజ్ సినిమా కోసం మరోసారి పవన్.!

Published on Sep 23, 2021 5:45 pm IST

ఇటీవల సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కి ఓ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు క్రమంగా కోలుకుంటుండగా ఇదే సమయంలో తన సినిమా “రిపబ్లిక్” సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ ని నిన్న రిలీజ్ చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక దీనితో పాటుగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. ఈ సినిమాకి గాను వచ్చే సెప్టెంబర్ 25 న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తుండగా ఈ ఈవెంట్ కి గాను పలువురు మెగా హీరోస్ తో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరు అవ్వనున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఈ ఈవెంట్ ని మేకర్స్ సెప్టెంబర్ 25 న చెయ్యాలని చేస్తున్నారట. ఇది వరకే పవన్ సాయి తేజ్ మరో ఫంక్షన్ కి కూడా అటెండ్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ, జగపతిబాబు తదితరులు నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే ఈ చిత్రం వచ్చే అక్టోబర్ 1న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :