టాక్..పవన్ తన భారీ సినిమా అప్పటికి పూర్తి చేస్తాడా?

Published on Jun 12, 2022 10:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో “హరిహర వీరమల్లు” అనే ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్ లోనే ఈ చిత్రం అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పైగా మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో భారీ స్థాయి అంచనాలు అభిమానులు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ కి ఉన్న పొలిటికల్ షెడ్యూల్ రీత్యా తాను సినిమాలపై ఎంతవరకు దృష్టి పెట్టగలడు అనేది ఆసక్తికర ప్రశ్నగా మారిపోయింది.

ముఖ్యంగా ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న ఈ వీరమల్లు సంగతి సందిగ్ధంలో పడింది. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం పవన్ తన పొలిటికల్ టూర్ కి ఉన్న ఈ గ్యాప్ లో వీరమల్లు సినిమాని కుదిరితే మరో రీమేక్ చిత్రాన్ని కంప్లీట్ చేసేసే అవకాశం ఉన్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. తన పార్ట్ వరకు పవన్ పాల్గొని కంప్లీట్ చేసేస్తాడు అని ఊహాగానాలు అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :