పవన్ చేతుల మీదుగా సునీల్ సినిమా టీజర్ !
Published on Nov 24, 2017 10:51 am IST

గత కొన్నాళ్లుగా మంచి కమర్షియల్ హిట్ లేక ఇబ్బందిపడుతున్న సునీల్ ఈ ఏడాది రెండు సినిమాలకు సైన్ చేశాడు. వాటిలో ఒకటి ఎన్. శంకర్ డైరెక్ట్ చేయనున్న చిత్రం. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘టూ కంట్రీస్’ కు రీమేక్ గా రూపొందుతోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు కూడా మంచి స్పందన లభించింది.

ఈ చిత్ర టీజర్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా లాంచ్ చేయనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్.శంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నరేష్, పోసాని కృష్ణ మురళి, పృథ్వి ప్రదాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాలో సునీల్ కు జోడిగా మనీషా హీరొయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook