‘చలోరే.. చలోరే.. చల్’ యాత్రను ప్రారంభించనున్న పవన్ !

ఇంకొద్దిసేపట్లో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో ‘చలోరే.. చలోరే.. చల్’ యాత్రను ప్రారంభించనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇంకాసేపట్లో జగిత్యాలలోని కొండగట్టుకు బయలుదేరనున్నారాయన. అక్కడే ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించి యాత్ర యొక్క కార్యాచరణను ప్రకటించనున్నారు.

సాయన్తరం కరీంనగర్ చేరుకొని పార్టీ ముఖ్య ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. మరుసటిరోజు 23వ తేదీన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కార్యకర్తలతో సమావేశమై ఆ తర్వాతి రోజు ఖమ్మంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో భేటీకానున్నారు. ఈ యాత్ర ద్వారా పార్టీ సిద్ధాంతాలని కార్యకర్తలకు వివరించి ఆయా జిల్లాలో ఉన్న సమస్యలను తెలుసుకోవాలన్నదే తన లక్ష్యమని, ఈ యాత్రలో ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్ ఉండవని పవన్ ఇంతకుముందే వెల్లడించారు.