భారీ పోరాటానికి రెడీ అవుతున్న పవన్ !
Published on May 13, 2017 9:33 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాలలో కామెడీ సన్నివేశాలు, పోరాట సన్నివేశాలు ప్రత్యేకంగా ఉంటాయి.ముఖ్యమంగా పోరాట సన్నివేశాల విషయం ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడతారు. పవన్ సొంతంగా ఫైట్ సీన్ లని కంపోజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తన కెరీర్ ఆరంభంలో ఆయన చిత్రాల్లోని ఫైట్ సీన్ లని ఆయనే కంపోజ్ చేసుకునేవారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.

కాగా ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.త్వరలో ఓ ఫైట్ సీన్ ని దర్శకుడు తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రంలో చాలా కీలకమైన ఈ ఫైట్ సీన్ ని విదేశీ యాక్షన్ కొరియేగ్రాఫర్ ల సమక్షంలో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ఫైట్ సీన్ విషయంలో పవన్ శిక్షణ తీసుకుంటున్నాడట. ఈ చిత్ర టైటిల్స్ విషయంలో ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలో ఉన్నా గోకుల కృష్ణుడు అనే టైటిల్ ఎక్కువగా వినిపిస్తోంది. పవన్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన రెండు చిత్రాలు జల్సా , అత్తారింటికి దారేది సూపర్ హిట్ లుగా నిలిచాయి. దీనితో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

 
Like us on Facebook