‘అజ్ఞాతవాసి’ ఫస్ట్ లుక్ కు డేట్ ఫిక్స్ !
Published on Nov 21, 2017 1:07 pm IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా ఫస్ట్ లుక్ ను నవంబర్ 25 న సాయంత్రం 6 గంటలకు విడుదల చెయ్యనున్నారు. నవంబర్ 7 త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మద్య సంక్రాంతి కానుకగా జనవరి 10 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మానుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో ఆడియో ఫంక్షన్ జరుపుకోనున్న ఈ సినిమా కు అనిరుద్ అందించిన సంగీతం ప్లస్ కానుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

 
Like us on Facebook