పవన్ – త్రివిక్రమ్ ల సినిమా మరో నెల వెనక్కు వెళ్ళింది !

17th, January 2017 - 03:18:55 PM

pawan-kalyan-trivikram
పవర్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ అంటే ఎంతటి క్రేజ్ ఉందో వేరే చెప్పనక్కర్లేదు. గతంలో వారి కలయికలో వచ్చిన ‘జల్సా, అత్తారింటికి దారేది’ వంటి విజయాలు చూస్తే అర్థమైపోతుంది. ప్రేక్షకుల్లో కూడా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే హిట్ ఖాయమనే బలమైన నమ్మకం కూడా ఉంది. అందుకే త్వరలో వీరు చేయనున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. 2016 ఆఖరులో అధికారికంగా లాంచ్ అయిన ఈ చిత్రం ఈ 2017 ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉంది.

కానీ కొన్ని రాజకీయ పరమైన పనుల వలన పవన్ డాలి డైరెక్షన్లో చేస్తున్న ‘కాటమరాయుడు’ షూట్ కాస్త ఆలస్యమై జనవరి పూర్తి కావాల్సింది ఫిబ్రవరికి పూర్తయ్యేలా ఉంది. ఈ ఆలస్యంతో ఫిబ్రవరిన మొదలుకావాల్సిన త్రివిక్రమ్ సినిమా మార్చిలో మొదలుకానుందట. ఇకపోతే కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘హారిక హాసిని క్రియేషన్స్’ బ్యానర్ నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతం అందించనున్నాడు.