పవన్ – తివిక్రమ్ ల సినిమా మెల్లగా స్పీడందుకుంటోంది !
Published on Oct 15, 2016 9:42 am IST

pawan-kalyan-trivikram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ దర్శకుడితో సినిమా చేసినా త్రివిక్రమ్ తో చేసే సినిమాకి వచ్చినంత క్రేజ్ మరే సినిమాకీ రాదు. ఎందుకనే వారి కాంబినేషన్ మీద అభిమానులకు అంత గురి. ప్రస్తుత్తం వీరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికే పవన్ డాలి డైరెక్షన్లో ‘కాటమరాయుడు’ చేస్తూనే, తమిళ దర్శకుడు నీసన్ దర్శకత్వంలో మరో సినిమాకి దసరా రోజున పూజా కార్యక్రమం నిర్వహించాడు. దీంతో అభిమానుల్లో పవన్ ఇంత బిజీగా ఉంటే త్రివిక్రమ్ సినిమానై ఎప్పుడు షురూ చేస్తాడు అనే సందేహాలు మొదలయ్యాయి.

వీటన్నింటికీ సమాధానంగా పవన్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తివిక్రమ్ తో సినిమా మొదలవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయట. తివిక్రమ్ కూడా స్క్రిప్ట్ పన్నుల్లో బిజీగా ఉన్నాడని, తరచూ పవన్ ను కలుస్తూ కహా చర్చలు చేస్తున్నాడని ప్రస్తుతం ఓకే చేసిన రెండు ప్రాజెక్టులతో పాటు ఈ సినిమా కూడా మొదలవుతుందని తెలుస్తోంది. సో ఇక పవన్, త్రివిక్రమ్ లలో ఎవరో ఒకరు అధికారిక ప్రకటన చేయడమే మిగిలుంది.

 
Like us on Facebook