పవన్ – త్రివిక్రమ్ ల సినిమా మొదలయ్యేది అప్పుడే !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కలయికలో కొన్ని రోజుల ఒక సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. వీరి గత సినిమాలు ‘జల్సా, అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలు భారీ విజయాలుగా నిలవడంతో ఈ సినిమాపై కూడా పెద్ద ఎత్తున అంచనాలున్నాయి. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠతో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్, నటీనటుల ఎంపిక వంటి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

తాజాగా సినీ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ మార్చి 14 నుండి మొదలవుతుందట. ఇప్పటికే చేస్తున్న ‘కాటమరాయుడు’ షూట్ పూర్తవగానే కాస్త గ్యాప్ తీసుకుని 14 నుండి రెగ్యులర్ షూట్లో పాల్గొంటాడట పవన్. ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాలో పవన్ కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు నటించనుండగా అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నారు.