త్రివిక్రమ్-పవన్ సినిమా ఏమైందీ?

pawan-and-trivikram
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది తిరుగులేని కాంబినేషన్. ‘జల్సా’ సినిమాతో ఈ కాంబినేషన్‌కు ఓ మంచి క్రేజ్ రాగా, ఆ తర్వాత వచ్చిన ‘అత్తారింటికి దారేది’తో అది తారాస్థాయికి చేరిపోయింది. మంచి మిత్రులు కూడా అయిన ఈ ఇద్దరూ మళ్ళీ ఓ సినిమా ఎప్పుడెప్పుడు చేస్తారా? ఎప్పుడెప్పుడు చూసేద్దామా? అని అభిమానులంతా ఎదురుచూస్తూనే ఉన్నారు. కొద్దినెలల క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని వార్తలు వినిపించినా, తర్వాత అవేవీ మళ్ళీ తెరపైకి వచ్చిన దాఖలాలు.

ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ – పవన్ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారిపోయింది. డిసెంబర్‌లో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. త్రివిక్రమ్‌తో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యామూర్తి’, ‘అ..ఆ..’ సినిమాలు చేసిన ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమా పవన్ స్టైల్లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని సమాచారం. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.