లొకేషన్ మార్చిన పవన్ కళ్యాణ్ !
Published on May 28, 2017 11:32 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల హిట్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మొదటి షెడ్యూల్ ను రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో షూట్ చేసిన చిత్ర బృందం తాజాగా లొకేషన్ మార్చారు. ప్రస్తుతం ఈ షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ కూడా సినిమా కోసం ప్రత్యేక సెట్ వేశారని సమాచారం.

ఇతర ముఖ్య తారాగణంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటారు. పవన్ – త్రివిక్రమ్ ల కలయిక నుండి అభిమానులు ఆశించే అన్ని అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇకపోతే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా సినిమాను ఆగష్టు లేదా సెప్టెంబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

 
Like us on Facebook