పవన్ – త్రివిక్రమ్ ల సినిమా షూటింగ్ రేపటి నుండే ?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తరువాతి చిత్రాన్ని తన మిత్రుడు, దర్శకుడు అయిన త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయనున్న సంగతి విదితమే. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ విడుదలతో పవన్ ఫ్రీ అవడంతో ఈ చిత్రాన్ని ఈ ఏప్రిల్ నెలలో మొదలుపెట్టాలని ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు. సినీ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూట్ రేపటి నుండే రామోజీ ఫిలిం సిటీలో మొదలవుతుందని తెలుస్తోంది. అయితే పవన్ మొదటి రోజు షూటింగ్లో పాల్గొనరని, ఈ మొదటి వారంలో ఎప్పుడైనా జాయిన్ అవుతారని అంటున్నారు.

అయితే ఈ వార్తపై పవన్ క్యాంప్ నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. పవన్ సరికొత్తగా సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా కనిపించనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటించనుండగా తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం చేయనున్నాడు. ఇకపోతే ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాను ఆగష్టు నెలకల్లా పూర్తి చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.