పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల సినిమా మొదలయ్యేది అప్పుడేనా ?

pawan-kalyan-trivikram
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల హిట్ కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ సినిమా ఎప్పుడు మొదలై ఎప్పుడు ఇప్పటివరకూ ఎవరికీ పెద్దగా తెలీదు. కానీ తాజాగా పవన్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ కూడా ఈ సంవత్సరమే మొదలవుతుందని తెలుస్తోంది. ఈ నెల 24 నుండి డాలి దర్శకత్వంలో మొదలుకానున్న ‘కాటమరాయుడు’ చిత్రం షూటింగ్ ను డిసెంబర్ నెల కల్లా రెండు షెడ్యూళ్లు పూర్తి చేసి అదే నెలలో తివిక్రమ్ తో షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమా కూడా వీరి గత సినిమాల కాంబినేషన్ లాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టుని సూర్య దేవర రాధాకృష్ణ నిర్మిస్తారట. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందివ్వనున్నాడు. గత మూడేళ్లుగా పవన్ కు సరైన హిట్ లేకపోవడంతో ఆయన అభిమానులు ఈ కాంబో కోసం ఎదుచూస్తున్నారు. పవన్ కూడా రాబోయేరోజుల్లో రాజకీయపరమైన పనులు ఎక్కువ ఉండే అవకాశముండటంతో వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే చూస్తున్నారట. ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.