పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల మూవీ అప్డేట్ !
Published on Nov 28, 2016 8:08 pm IST

pawan-kalyan-trivikram
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ ల చిత్రం ఇటీవలే లాంచింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండే సినిమా రిజల్ట్ పై భారీ అంచనాలు మొదలయ్యాయి. వీరి గత సినిమాలు ‘జల్సా, అత్తారింటికి దారేది’ లు భారీ విజయాలుగా నిలవడం, వీరిద్దరి అభిప్రాయాలు చాలా వరకూ దగ్గరగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణాలు. పవన్ అభిమానులంతా ఈ సినిమాని ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా, అసలు కథేమిటి, ఇందులో పవన్ లుక్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఆసక్తిగా చర్చించుకుంటూ సినిమా త్వరగా మొదలైతే బాగుండునని అనుకుంటున్నారు.

అలాగే పవన్ కూడా ఇప్పటికే మూడు సినిమాలు ఓకే చేసి ఉండటంతో వీలైనంత త్వరగా వాటిని కంప్లీట్ చేయాలని ఈ సినిమాని 2017 జనవరి ఆరంభంలో మొదలుపెడితే బాగుంటుందని అనుకున్నాడట. అందుకే జనవరి నాటికి ‘కాటమరాయుడు’ టాకీ పూర్తి చేయాలని పనిచేస్తున్నాడట. త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్ సిద్ధంగా ఉండటంతో జనవరి ముహూర్తానికి ఓకే చెప్పాడని, జూన్ లేదా జూలైనాటికి సినిమాని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook