ఫిబ్రవరి నుండి ప్రారంభం కానున్న పవన్ – త్రివిక్రమ్ ల సినిమా ?

16th, December 2016 - 09:30:46 AM

pawan-kalyan-trivikram
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్లో కొత్త చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. కొద్ది వారాల క్రితమే అధికారికంగా లాంచ్ అయినా ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా టాలీవుడ్ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ 2017 ఫిబ్రవరి నుండి మొదలవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ డాలి డైరెక్షన్లో చేస్తున్న ‘కాటమరాయుడు’ షూటింగ్ డిసెంబర్ ఆఖరుకు లేదా జనవరి నెలలో పూర్తయ్యే అవకాశాలున్నాయి.

త్రివిక్రమ్ పవన్ విషయంలో అనుసరించే తన పాత ఫార్ములా ప్రకారమే ఈ చిత్రంలో కూడా కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయల్ ఇద్దరిని హీరోయిన్లుగా ఫిక్స్ చేశాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన హిట్ సినిమాలు ‘జల్సా, అత్తారింటికి దారేది’ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లతో పవన్ రొమాన్స్ చేశాడు. ఈ సినిమాతో పవన్ పలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడని అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 2017 టాలీవుడ్ క్రేజియస్ట్ ప్రాజెక్టుల్లో ఇదే ముందు వరుసలో ఉంటుంది. ‘హారిక హాసిని క్రియేషన్స్’ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించనున్నాడు.