ముఖ్యమంత్రిని కలిసిన పవన్ కళ్యాణ్ !

31st, July 2017 - 11:40:59 AM


సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారానికై హార్వర్డ్ యూనివర్శిటీ డాక్టర్లతో నిన్న విశాఖలో భేటీ అయిన అయన అన్ని రకాల వివరాలతో, విశ్లేషణలతో అమరావతిలోని సచివాలయంకు చేరుకున్నారు.

పవన్ వెంట హార్వర్డ్ డాక్టర్లు కూడా ఉండగా ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. ప్రస్తుతం వారిద్దరి మధ్య సమస్య శాశ్వత పరిష్కారానికై చర్చ జరుగుతోంది. ఈ చర్చల ఫలితం సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే విధంగా ఉండాలని ఉద్దానం బాధితులతో పాటు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.