సినిమా కోసం థాయ్ ల్యాండ్ లో ల్యాండ్ అయిన పవన్!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కలయికలో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్లో సుమారు 40 శాతం చిత్రీకరణను పూర్తి చేసిన టీమ్ ప్రస్తుతం విదేశాల్లో షెడ్యూల్ జరుపుతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ థాయ్ ల్యాండ్ లో ఉన్నారు. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గోంటున్నారు. రేపు బ్యాంకాక్ లో పవన్, కీర్తి సురేష్ ల పై ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుగుతుందట.

వారం పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఇకపోతే ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు అను ఇమ్మాన్యుయేల్ కూడా ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అంతేగాక కుష్బూ, బోమన్ ఇరానీ వంటి సీనియర్ నటీనటులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. హారిక హాసిని క్రియఁషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 జనవరి 10న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.