మరో పోరాటానికి సిద్దమవుతున్న పవన్ కళ్యాణ్ !


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయా రంగప్రవేశం చేసినప్పటి నుండీ సినిమాలు, పాలిటిక్స్ రెండింటిలో ఏ ఒక్క దాన్ని నిర్లక్ష్యం చేయకుండా రెండింటికీ సమయం కేటాయిస్తూ వస్తున్నారు. ఒక వైపు ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ చేస్తూనే మరో రెండు సినిమాలకి సైన్ చేసి మరోవైపు ప్రజా పోరాటాల్లో సైతం పాల్గొంటున్నారు. ఈ మధ్యే ఉద్దానం కిడ్నీ భాదితుల కోసం ఉద్యమించిన పవన్ ఇప్పుడు చేనేత కార్మికుల కోసం పోరాడేందుకు సిద్ధమవుతున్నారు.

గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికుల బాధలు తెలుసుకుంటున్న పవన్ చెంత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి అంగీకరించడమే కాక రేపు 20వ తేదీన సోమవారం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో రాష్ట్రంలోని చేనేత కార్మికులంతా కలిసి చేస్తున్న నిరాహారదీక్షకు సైతం హాజరుకానున్నారు. ఇప్పటికే పవన్ రాక కోసం మంళగిరిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభలో పవన్ చేనేత కార్మికుల బాగు కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రస్తావించనున్నారు.