పవన్ అప్పటివరకు “ఓజి” లోనే.?

Published on Jun 3, 2023 1:00 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ఓజి” కూడా ఒకటి. మరి దీనిపై భారీ అంచనాలు ఉండగా ఈ చిత్రాన్ని అయితే ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ షూట్ ని సక్సెస్ ఫుల్ గా మేకర్స్ కంప్లీట్ చేసేసారు. అలాగే మరో పక్క అయితే పవన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఈ సినిమాకే ఉందని బజ్ ఉంది.

అయితే లేటెస్ట్ గా పవన్ పొలిటికల్ పరంగా అయితే ఈ జూన్ 14 నుంచే తన వారాహి యాత్రని స్టార్ట్ చేయనున్నట్టుగా నిన్ననే కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ లోపు మాత్రం అన్ని డేట్స్ కూడా ఓజి చిత్రానికే పవన్ ఇవ్వనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. దీనితో అప్పటి వరకు మాత్రం పవన్ ఓజి షూట్ లోనే ఉండనున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :