పవన్ కళ్యాణ్ ను సరికొత్తగా చూపించనున్న త్రివిక్రమ్ !

12th, March 2017 - 01:20:48 PM


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ అంటే భారీ అంచనాలతో పాటు ఖచ్చితంగా హిట్ అనే ఒక నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. త్రివిక్రమ్ కూడా ఆ అంచనాలకు తగ్గట్టే పవన్ కళ్యాణ్ ను ఎప్పటికప్పుడు సరికొత్తగా చూపిస్తూ ఫ్యాన్సును ఖుషీ చేస్తుంటాడు. వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘జల్సా’లో పవన్ ను ఒక స్టూడెంట్ గా, నక్సలైట్ గా చూపించి రెండవ సినిమా ‘అత్తారింటికి దారేది’ లో కాస్త లెవల్ చూపించే ధనవంతుడిగా చూపించిన త్రివిక్రమ్ త్వరలో మొదలుకాబోతున్న కొత్త చిత్రంలో సైతం సరికొత్తగా చూపించనున్నాడట.

సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రంలో పవన్ ఒక సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా దర్శనమివ్వనున్నాడట. ఏ వార్తలు ప్రకారం త్రివిక్రమ్ పవన్ ను టెక్కీగా తేరా మీద ఆవిష్కరిస్తే అభిమానులకు కనులవిందనే చెప్పాలి. ఈ చిత్రం కోసం ఇప్పటికే త్రివిక్రమ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక సాఫ్ట్ వేర్ ఆఫీస్ సెట్ ను కూడా వేయిస్తున్నాడట. పవన్ ‘కాటమరాయుడు’ చిత్రీకరణ ముగించగానే ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాలో పవన్ కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు నటించనుండగా అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నారు.