ఛేజింగ్ సీన్స్ కి పవన్ ‘భీమ్లా నాయక్’ రెడీ !

Published on Oct 11, 2021 6:56 am IST

‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ అయిన భీమ్లా నాయక్ నుండి ఒక అప్ డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలోని ఛేజింగ్ సన్నివేశాలను తెరకెక్కించడానికి మేకర్స్ సిద్ధం అయ్యారు. ఈ సీన్స్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయబోతున్నారు. ఇక ఈ సీన్స్ లో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా ఉండనున్నాడు. సినిమాలో ఇంటర్వెల్ లో ఈ సీన్స్ వస్తాయట. మొత్తానికి చకచకా షూటింగ్‌ను పూర్తి చేసేసుకుంటున్న ఈ సినిమాలో పవన్ పూర్తి కొత్తగా కనిపించబోతున్నాడు.

ఏది ఏమైనా క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మళయాలి రీమేక్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను తెలుగులో దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుడగా.. నవీన్ నూలి ఎడిటర్‌ వర్క్ చేస్తున్నాడు. అలాగే రవి కే చంద్రన్‌ కెమెరామెన్‌ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా
త్రివిక్రమ్ ఈ సినిమా కథలో మార్పులు చేర్పులు చేశాడు.

సంబంధిత సమాచారం :