పవన్ ‘హరిహర వీరమల్లు’ పై కొత్త రూమర్ !

Published on Jul 11, 2022 6:21 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ పై ఒక లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా బ్యాలెన్స్ పార్ట్ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే, ఈ బ్యాలెన్స్ పార్ట్ లో ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. మరి భారీ యాక్షన్ సీన్స్ ను శరవేగంగా షూట్ చేసినా టైమ్ పడుతుంది. అందుకే.. పవన్ పై ఉన్న షాట్స్ ను ముందుగా తీసుకుని.. ఆ తర్వాత కాంబినేషన్ షాట్స్ లో లింక్ చేస్తారట.

ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఇప్పటికే ప్రత్యేక సెట్స్ కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :