ఎట్టకేలకు సెట్స్‌పైకెళ్ళిన పవన్ సినిమా!

katamarayudu
‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి పరాజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆలస్యంగా చేయకుండా తన కొత్త సినిమాను చాలాకాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడు ఎస్.జె.సూర్య సినిమా నుంచి తప్పుకోవడంతో షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత డాలీని దర్శకుడిగా ఎంపిక చేసిన టీమ్ మళ్ళీ ప్రీ ప్రొడక్షన్‌ను కొత్తగా మొదలుపెట్టి ఇప్పటికి ఓ పక్కా స్క్రిప్ట్‌తో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళింది. నేడు హైద్రాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది.

‘కాటమరాయుడు’ అన్న టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా 15రోజుల పాటు హైద్రాబాద్‌లోనే షూటింగ్ జరుపుకోనుంది. ఇక గత కొద్దికాలంగా ఈ సినిమా కోసమే వర్కవుట్స్ చేస్తోన్న పవన్, త్వరలోనే సెట్స్‌లో జాయిన్ కానున్నారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో జరిగే ప్రేమకథగా సినిమా ప్రచారం పొందుతోంది.