‘కాటమరాయుడు’ ప్రీమియర్ షోల సంగతేమిటి!

11th, March 2017 - 10:01:26 AM


పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’ చివరి దశ షూటింగ్లో ఉంది. ప్రస్తుతం టీమ్ యూరప్ లో పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మార్చి 24 న రిలీజ్ కానున్న ఈ చిత్రం తప్పక రికార్డ్ కలెక్షన్లు సాదిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు పవన్ ఫ్యాన్స్ అప్పుడే 24 ముందురోజు 23న రాత్రి ప్రీమియర్ షోల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు.

ఎవరికీ వారు సినీ సన్నిహిత వర్గాల ద్వారా ప్రీమియాయ్ర్ షోలు ఉంటాయా, ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు, ఎన్ని గంటలకు అనే వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సినీ సరికల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం చూస్తే మార్చి 23న రాత్రి ఖచ్చితంగా ప్రీమియర్ షోలు ఉంటాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇంకొద్ది రోజుల్లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.