శరవేగంగా పవన్ సినిమా ప్రీ ప్రొడక్షన్!

20th, July 2016 - 05:19:00 PM

pawan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న కొత్త సినిమా విషయంలో కొద్దికాలంగా అయోమయం నెలకొన్న విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాకు ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాల్సి ఉండగా, చివరినిమిషంలో ఆయన తప్పుకోవడంతో ప్రస్తుతం డాలీ ఈ సినిమాకు దర్శకుడిగా ఎంపికయ్యారు. ఇక జూలై మొదటివారంలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ళేలా టీమ్ పక్కాగా ప్లాన్ చేసినా, దర్శకుడు మారడంతో మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ కొత్తగా మొదలైంది.

ఇక తాజాగా టీమ్ వర్గాల దగ్గర్నుంచి అందుతోన్న సమాచారాన్ని బట్టిచూస్తే, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి కావచ్చిందని, కొద్దికాలంగా విశ్రాంతి తీసుకుంటూ వస్తోన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగమయ్యారని తెలిసింది. శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఓ ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ప్రేమకథగా ప్రచారం పొందుతోంది. ఆగష్టులో సినిమా సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి.