‘పవన్ కళ్యాణ్’ కుమారుడు ‘అఖీరా నందన్’ డెబ్యూట్ డేట్ ఫిక్సైంది

akhira
పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ అంటే అభిమానుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి తరువాత అంతటి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో ఆయనొక్కడే. అందరి స్టార్ల కొడుకుల్లాగే పవన్ కుమారుడు ‘అఖీరా నందన్’ పై కూడా ఎప్పటికైనా అఖీరా సినిమాల్లోకి వస్తాడనే నిర్ణయం అభిమానుల్లో బలంగా ఉంది. వాళ్ళ ఆలోచనల్ని నిజం చేస్తూ అఖీరా త్వరలో తెరపై కనబడనున్నాడు. కానీ అది బుల్లి తెర.

2014లో పవన్ భార్య ‘రేణు దేశాయ్’ మరాఠీ భాషలో తాను స్వయంగా రాసి, నిర్మించిన, దర్శకత్వం వహించిన ‘ఇష్క్ వాలా లవ్’ చిత్రం యొక్క తెలుగు డబ్ సెప్టెంబర్ 4న ఈటీవీలో టెలీకాస్ట్ అవుతుందని తెలియజేశారు. ఈ చిత్రంలో అఖీరా ఓ పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ఒక్కసారిగా పవన్ అభిమానుల్లో సందడి నెలకొంది. ట్విట్టర్లో వెల్కమ్ అఖీరా అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ కూడా చేస్తున్నారు. ఎంతైనా తమ అభిమాన నటుడి వారసుడు తెరపై కనిపిస్తున్నాడంటే అభిమానులకు విశేషమే కదా.