అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ !

katamarayudu

సర్దార్ గబ్బర్ సింగ్ పరాజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం కావడంతో ‘కాటమరాయుడు’ పై అభిమానుల్లో భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి. ఈ సినిమాతో పవన్ మరోసారి సరికొత్త ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేస్తాడని అందరూ ఆశిస్తున్నారు. ప్రస్తుతం పొలాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ పవన్ హాలీడే నుండి తిరిగిరాగానే జనవరి మొదటి వారంలో మొదలవుతువుంది. ఇకపోతే చిత్ర యూనిట్ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ప్లాన్ చేస్తోంది.

కొత్త సంవత్సర శుభాకాంక్షలతో కాటమరాయుడు పోస్టర్ ను విడుదలచేస్తారట. ఈ విడుదల ఏ తేదీన ఉంటుంది, ఏ టైమ్ లో ఉంటుంది అనే విషయాలను త్వరలోనే చెబుతామని చిత్ర నిర్మాత శరత్ మరార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమిళ ‘వీరమ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ‘గోపాల గోపాల’ ఫేమ్ డాలి డైరెక్ట్ చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.