బాలయ్యకు కూడా పవన్ టెక్నీషియన్?


నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సాదించిన విజయంతో ఆయన చేయబోయే 101వ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ 101వ ప్రాజెక్ట్ ను పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం ఇంకాస్త పెరిగింది. కథ నుండి ఇందులో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణులు వరకు ప్రతి అంశంలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలను బట్టి చూస్తే ఈ ప్రాజెక్టుకు పవన్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’కు పనిచేస్తున్న ఒక టెక్నీషియన్ పనిచేయనున్నాడని తెలుస్తోంది.

అతనెవరో కాదు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. పూరి జగన్నాథ్ రూపొందించిన ‘టెంపర్, ఇజం, హార్ట్ ఎటాక్’ వంటి చిత్రాలకు అనూప్ మ్యూజిక్ అందించాడు. ఆ ప్రాజెక్ట్స్ అన్నీ మ్యూజికల్ గా మంచి హిట్లయాయ్యి కూడా. కనుక పూరి కొత్తదనం కోసం అతన్నే ఈ ప్రాజెక్టులోకి తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఒక సమాచారంగా మాత్రమే తెలుస్తున్న ఈ కలయిక పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.