ప్రభాస్ సినిమాలో పవన్ విలన్ !


ప్రభాస్ తర్వాతి చిత్రం ‘సాహో’ ని జాతీయ స్థాయి సినిమాగా రూపొందించడానికి నిర్మాతలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించి ప్రముఖ టెక్నీషియయన్లతో పాటు బాలీవుడ్ కు చెందిన స్టార్ నటీ నటుల్ని ప్రాజెక్టులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే హీరోయిన్ గా శ్రద్దా కపూర్ ను ఫైనల్ చేసిన టీమ్ ఇంతకు ముందే నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే వంటి హిందీ నటుల్ని ప్రతి నాయకులుగా ఎంచుకుంది.

వీరితో పాటు ఇప్పుడు తాజాగా మరొక బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్ ను కూడా సినిమాలోకి తీసుకుంది. ఈయన కూడా ప్రతి నాయకుడిగానే నటించనున్నారు. జాకీ ష్రాఫ్ గతంలో పవన్ కళ్యాణ్ చిత్రమైన ‘పంజా’ లో స్టైలిష్ విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. ఈయన వచ్చే వారం నుండి షూటింగ్లో పాల్గొననున్నారు. హీరో ప్రభాస్ కూడా కొద్దిరోజుల క్రితమే చిత్రీకరణలో జాయిన్ అయ్యారు. ఇప్పటికే ఇన్ని హంగుల్ని అద్దుకున్న ఈ చిత్రం రిలీజ్ నాటికి ఇంకెన్ని విశేషాల్ని నింపుకుంటుందో చూడాలి.