హీరోయిన్ పై యాసిడ్‌ దాడి !

Published on Sep 21, 2021 8:05 pm IST

బాలీవుడ్ పరిశ్రమలో పలు వివాదాల్లో చిక్కుకున్న హీరోయిన్ పాయల్ ఘోష్ పై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌ దాడి చేశారు. ఈ విషయాన్ని స్వయంగా పాయల్‌ ఘోష్‌ చెప్పుకొస్తూ ఇన్‌స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. పాయల్ పెట్టిన మెసేజ్ ఏమిటంటే.. ‘చాలా రోజుల తర్వాత నేను బయటకు వెళ్ళాను. అది కూడా ఇంట్లో వాళ్లకు కావాల్సిన మందులు తీసుకురావడానికి వెళ్లాను.

అయితే నా పనులన్నీ పూర్తి చేసుకుని కారు ఎక్కుతుంటే.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి.. నాపై దాడి చేశారని’ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మరి ఈ దాడి ఎవరు చేశారనేది తెలియాల్సి ఉంది. పాయల్ వారి నుంచి తప్పించుకున్నా.. ఆమె చేతికి స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత సమాచారం :