“RX100” హీరో కార్తికేయ పెళ్లికి హాజరైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్!

“RX100” హీరో కార్తికేయ పెళ్లికి హాజరైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్!

Published on Nov 21, 2021 3:00 PM IST

RX 100 తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసారు కార్తికేయ మరియు పాయల్ రాజ్ పుత్. హీరో హీరోయిన్ ఇద్దరికీ కూడా ఈ చిత్రం చాలా క్రేజ్ ను తీసుకు వచ్చింది. అయితే నేడు కార్తికేయ పెళ్లి లోహిత రెడ్డి తో హైదరాబాద్ లో ఘనంగా పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకకు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హాజరు అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా లో ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటోలు కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

కార్తికేయ లోహిత ను 2010 లో NIT వరంగల్ లో కలిశారు. ఇటీవల జరిగిన రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ వేడుక లో హీరో కార్తికేయ స్టేజ్ పై లోహిత కి ప్రపోజ్ చేసి తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాక ప్రముఖ హీరో అజిత్ నటిస్తున్న వలిమై లవ్ సైతం ఒక కీ రోల్ లో నటిస్తున్నారు కార్తికేయ. నేడు జరిగిన కార్తికేయ పెళ్లికి టాలీవుడ్ లోని ప్రముఖులు హాజరు అయ్యి, కొత్త జంట ను ఆశీర్వదించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు