‘బంగార్రాజు’లో పాయల్ చెయ్యట్లేదట !

Published on May 24, 2021 9:00 pm IST

అక్కినేని నాగార్జున న‌టించిన “సోగ్గాడే చిన్ని నాయ‌న” మంచి విజయాన్ని సాధించడంతో ఆ సినిమాకి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే హాట్ బ్యూటీ ‘పాయల్ రాజ్ పుత్’ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతుంది అని రూమర్స్ వచ్చాయి.ఆమె చేయబోయేది ఐటెమ్ సాంగ్ అని కూడా బాగా ప్రచారం జరిగింది.

అయితే పాయల్ మాట్లాడుతూ ‘బంగార్రాజు’ సినిమాలో నేను ఐటమ్ సాంగ్ చెయ్యట్లేదు. అలాగే నేను ప్రస్తుతం ఏ స్పెషల్ సాంగ్స్ ల్లోనూ నటించడం లేదు. ఇది చెప్పాలనేదే ఈ పోస్ట్’ అంటూ మొత్తానికి పాయల్ వస్తోన్న పుకార్ల పై వివరణ ఇచ్చింది. ఏది ఏమైనా పాయల్ రాజపుత్ కెరీర్ ప్రస్తుతం ఆశించిన స్థాయిలో లేదు. ‘ఆర్ ఎక్స్ 100’, ‘వెంకీ మామా’ లాంటి హిట్స్ ఆమె కెరీర్ లో ఉన్నా.. ఆమె స్టార్ కాలేకపోయింది.

సంబంధిత సమాచారం :