మళ్ళీ గ్లామర్ నే నమ్ముకున్న పాయల్ !

Published on Oct 31, 2021 5:00 pm IST

ఆది సాయి కుమార్ కథానాయకుడిగా, గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా రాబోతున్న చిత్రం “తీస్ మార్ ఖాన్. అయితే, ఈ సినిమాలో పాయల్ పాత్ర పై ఒక రూమర్ వినిపిస్తోంది. హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న పాయల్ రాజపుత్, ఈ సినిమాలో కూడా బోల్డ్ గా కనిపించబోతుందట. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆమె మళ్ళీ అందాల ప్రదర్శనే నమ్ముకుంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్ చూస్తేనే.. పాయల్ ఏ రేంజ్ లో గ్లామరస్ గా కనిపించబోతుంది అర్ధం అవుతుంది. హై యాక్షన్ వోల్టేజ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి పాయల్ అంగాంగ ప్రదర్శనతో ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :