విజయ్ దేవరకొండ చిత్రానికి పనిచేయనున్న లెజెండరీ సినిమాటోగ్రాఫర్ !


వివిధ భాషల్లో ఎన్నో చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు పీసీ. శ్రీరామ్ గారు. తెలుగులో ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా గుర్తుండిపోయే సినిమాలు చేశారు. ఆయనతో పని చేయడానికి గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ఆయన తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో వస్తున్న ‘ఎం.ఎల్.ఏ’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణ సారధ్యంలో ఒక సినిమా రాబోతుంది. ఈ సినిమా కోసం పీసి శ్రీరామ్ గారిని నందిని రెడ్డి సంప్రదించారట. ఇదివరకు ఈమె దర్శకత్వంలో వచ్చిన ‘కళ్యాణ వైభోగమే’ సినిమా చూసి పీసీ గారు ప్రశంసింఛి, నందిని గారితో పని చేయడానికి ఆసక్తి కనబరిచారు. కాబట్టి ఈ సినిమాకు ఆయన ఓకే చెప్పే అవకాశాలున్నాయి. ఇకపోతే ఈ చిత్రం ఏడాది చివర్లో కాని, వచ్చే సంవత్సరం కాని సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలున్నాయి.