నైజాం లో డిజాస్టర్ రన్ కంటిన్యూ చేస్తున్న “పెద్దన్న”

Published on Nov 7, 2021 1:00 pm IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు శివ కాంబోలో తెరకెక్కించిన భారీ సినిమా “అన్నాత్తే”. తెలుగులో “పెద్దన్న” పేరిట రిలీజ్ చేసిన ఈ చిత్రం రజినీ కెరీర్ లోనే ఊహించని ఓపెనింగ్స్ తెలుగు స్టేట్స్ లో అందుకుంది. తమిళ నాట రికార్డు బ్రేకింగ్ వసూళ్లను అందుకున్న ఈ చిత్రం ఇక్కడ మాత్రం దానికి పూర్తి విరుద్ధమైన రెస్పాన్స్ అందుకోవడం గమనార్హం.

లేటెస్ట్ గా ఈ చిత్రం నైజాం మూడో రోజు వసూళ్లు వివరాలు తెలిసాయి. ఈ చిత్రానికి నైజాం మూడో రోజు కేవలం 6.31 లక్షలు మాత్రమే వసూలు చేసిందట. దీనితో నైజాం లో మొత్తం 34.97 లక్షలు గ్రాస్ ఇప్పుడు వరకు వచ్చింది. దీనితోనే అర్ధం అవుతుంది సినిమా ఏ స్థాయిలో పెర్ఫామ్ చేస్తుంది అనేది. తెలుగు వరకు వచ్చి లాస్ట్ మినిట్ లో అంతా గందరగోళంగా స్టార్ట్ చెయ్యగా సరైన బజ్ సినిమాను తెచుకోలేకపోయింది. దీనితో పెద్దన్న తెలుగు స్టేట్స్ లో పెద్ద డిజాస్టర్ గా నిలిచిపోవడం ఖాయంగా అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More