ఈ సంక్రాంతి కి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా పెద్దన్న!

Published on Dec 28, 2021 2:40 pm IST


రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెద్దన్న. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల ప్రేక్షకులను అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం ఓపెనింగ్స్ ను బాగా రాబట్టింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది.

సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం జనవరి నెలలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రానుంది. జెమిని టీవీ లో ఈ సినిమా ప్రసారం కానుంది. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తీ సురేష్ లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి డి. ఇమ్మన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :