మిస్టర్ బాక్సాఫీస్ పై నమ్మకం.. భారీ ప్లాప్ వచ్చినా ‘పెద్ది’ లెక్కలు వింటే!

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పెద్ది” (Peddi)కోసం అందరికీ తెలిసిందే. సాలిడ్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ సినిమాతో రామ్ చరణ్ మంచి కంబ్యాక్ ఇవ్వాలని చరణ్ అభిమానులు అలాగే మెగా అభిమానులు కూడా భావిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి ముందు గేమ్ ఛేంజర్ లాంటి భారీ వైఫల్యం ఉన్నప్పటికీ కూడా పెద్ది సినిమాకి రికార్డు బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నార్త్ అమెరికా డీల్ పై వినిపిస్తున్న రూమర్స్ ఇంకా ఓటిటి డీల్ పై ఫిగర్స్ వంటివి రామ్ చరణ్ ని మిస్టర్ బాక్సాఫీస్ అని ఎందుకు అంటారో చెబుతున్నాయి.

కరెక్ట్ హీరోకి కరెక్ట్ కంటెంట్ కరెక్ట్ టైం కి కుదిరితే ఎలా ఉంటుందో పెద్ది తో రామ్ చరణ్ చూపిస్తున్నాడని ట్రేడ్ వర్గాల్లో టాక్. ఓటిటి డీల్ గా 100 కోట్లకి పైగా డీల్ ముగిస్తే ఓవర్సీస్ మార్కెట్ లో రామ్ చరణ్ కెరీర్ లోనే సోలోగా బిగ్గెస్ట్ నెంబర్ ఈ సినిమాకి నమోదు అయినట్టు తెలుస్తుంది. ఇది అంతా గత సినిమా ఓవర్సీస్ లో అనుకున్న రీతిలో రాణించకపోయినప్పటికీ కావడం విశేషం. మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజికే చేస్తుందో చూడాలి.

Exit mobile version