టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాస్త గ్యాప్ తీసుకొని లేటెస్ట్ గా చేసిన చిత్రమే “పెదకాపు”. కొత్త హీరో విరాట్ కర్ణని టాలీవుడ్ కి పరిచయం చేస్తున్న ఈ చిత్రం డీసెంట్ బజ్ అని అయితే సొంతం చేసుకుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ ట్రైలర్ లు మంచి స్పందనను అందుకోగా ఇక మేకర్స్ అయితే ఇప్పుడు రిలీజ్ కి తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా పట్ల మేకర్స్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉండగా ఈ కాన్ఫిడెంట్ ఎంతలా ఉంది అంటే మేకర్స్ ఇపుడు సినిమాకి రిలీజ్ రోజు ముందే పైడ్ ప్రీమియర్స్ ని వేసేందుకు సిద్ధం అయ్యారు.
మరి సెప్టెంబర్ 28 రాత్రి బుకింగ్స్ అయితే ఆల్రెడీ హైదరాబాద్ లో స్టార్ట్ కానున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇలా ముందే పైడ్ ప్రీమియర్ కి వచ్చిన అన్ని సినిమాలు కూడా మంచ్చి విజయాన్ని సాధించాయి. మరి ఈ చిత్రం కూడా ఈ లిస్ట్ లో నిలుస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా ద్వారకా చిత్రాన్ని నిర్మాణం వహించారు.