పెళ్లి చూపులు దర్శకుడి రెండవ సినిమా ఆ కథలా ఉంటుందట!

27th, April 2017 - 12:42:54 PM


ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం పెళ్లి చూపులు. మొదటి సినిమానే ఎవరు ఊహించని విధంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాకుండా జాతీయ పురస్కారాన్ని సైతం అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. అయితే అంత గొప్ప విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం తన రెండవ సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం. ఈ యువ దర్శకుడు ఒక వైవిధ్యమైన కామెడీ కథతో రాబోతున్నాడు. ఈ చిత్రం హిందీలో అమిర్ ఖాన్ నటించిన ‘ దిల్ చాహత హై’ తరహాలో ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న తరుణ్ భాస్కర్ ఇంకా నటీనటులను అధికారికంగా తెలియజేయలేదు. సినిమా ఎప్పుడు ఆరంభమవుతుంది, సాంకేతిక నిపుణులు వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.అయితే త్వరలోనే తరుణ్ భాస్కర్ తన రెండవ చిత్రాన్ని ఓ స్టార్ హీరోతోనే ప్లాన్ చేస్తున్నాడని సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.