పెద్ద రికార్డులు కొడుతున్న చిన్న సినిమా

Pellichoopulu
విజయ్ దేవరకొండ, రియూ వర్మ జంటగా వచ్చిన చిత్రం ‘పెళ్లి చూపులు’ ఘానా విజయం సాధించిన సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 29న విడుదలై ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తూ 50 రోజులు పూర్తి చేసుకుని భారీ వసూళ్లు సాధించింది. అలాగే ఈ చిత్రం యూఎస్ లో సైతం సంచలనం సృష్టించింది.

క్లాస్ సినిమాలను, కంటెంట్ ఉన్న సినిమాలను యూఎస్ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే పెళ్లి చూపులు చిత్రం యూఎస్ బాక్సాఫిస్ వద్ద భారీ హిట్ గా నిలిచి ఈ మధ్య కాలంలో విడుదలైన చాలా పెద్ద సినిమాలకు సాధ్యం కాని ఓ ఫీట్ ను సాధించింది. అదేమిటంటే యూఎస్ఏ లో 10 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఈ విజయంతో పెద్ద పెద్ద స్టార్లు లేకపోయినా బలమైన కథా కథనాలు ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ‘పెళ్లి చూపులు’ నిరూపించింది.