మహేష్ సినిమాకు పనిచేయడం అద్భుతంగా ఉందన్న పెళ్ళిచూపులు స్టార్!

priyadarsi
‘పెళ్ళిచూపులు’ అనే సినిమా గత నెల్లో తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక ఈ సినిమాలో కౌశిక్ అనే ఓ పాత్రలో నటించిన నటుడు ప్రియదర్శి, సినిమా విడుదల తర్వాత టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. ఇక ఆ తర్వాత ప్రియదర్శికి వరుసగా అవకాశాలు వెల్లువెత్తగా సూపర్ స్టార్ మహేష్ సినిమాలో ఓ రోల్ దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మహేష్, దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌లో ప్రియదర్శి ఈమధ్యే జాయిన్ అయ్యారు.

ఇక మహేష్, మురుగదాస్ లాంటి స్టార్స్‌తో పనిచేయడం అద్భుతంగా ఉందని, ఈ మూమెంట్‌ను ఎప్పటికీ పదిలంగా దాచుకుంటానని ప్రియదర్శి అన్నారు. ఇక ఈ ఉదయం మురుగదాస్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను ప్రియదర్శి షేర్ చేశారు. ప్రస్తుతం చెన్నైలో ఓ భారీ షెడ్యూల్ జరుపుకుంటోన్న మహేష్ సినిమా మరో నెలరోజులు ఈ షూటింగ్ జరుపుకోనుంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధుఅ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.