కొత్త సినిమాను మొదలుపెట్టిన ‘పెళ్లి చూపులు’ దర్శకుడు !
Published on Aug 6, 2017 1:31 pm IST


2016లో విడుదలై ఘన విజయాన్ని అందుకున్న సినిమాల్లో ‘పెళ్లి చూపులు’ కూడా ఒకటి. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం భారీ సక్సెస్ ను, వసూళ్లను అందుకోవడంతో ఆ చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ మోస్ట్ వాంటెడ్ యువ దర్శకుల్లో ఒకడిగా మారిపోయారు. కానీ ఆ సినిమా విడుదలై సంవత్సరం కావొస్తున్నా ఆయన ఇన్నాళ్లు కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టకపోవడంతో అంతా కొంత ఆశ్చర్యానికి గురయ్యారు.

ఆ ఆశ్చర్యానికి తెరదించుతూ తరుణ్ భాస్కర్ ఎట్టకేలకు కొత్త సినిమాను మొదలుపెట్టారు. అది కూడా తన మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’ కు మంచి సపోర్ట్ ఇచ్చి, గొప్ప విజయం సాదించేందుకు తోడ్పడిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కావడం విశేషం. ప్రస్తుతం సినిమాలో కొత్త నటీనటుల కోసం ఆడిషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించిన మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

 
Like us on Facebook