డే 2 ‘బ్యాచ్ లర్, పెళ్లి సందD’ నైజాం వసూళ్ల వివరాలు.!

డే 2 ‘బ్యాచ్ లర్, పెళ్లి సందD’ నైజాం వసూళ్ల వివరాలు.!

Published on Oct 17, 2021 3:59 PM IST

ఈ ఏడాది దసరా కానుకగా పలు ఆసక్తికర సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాయి. పోటీ అని కాకుండా మంచి అంచనాలతోనే అన్ని సినిమాలు కూడా వచ్చాయి. అయితే వాటిలో అఖిల్ అక్కినేని హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” ఇంకా శ్రీకాంత్ తనయుడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ నటించిన “పెళ్లి సందD” చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి.

అయితే మొదటి రోజే మంచి వసూళ్లు ఈ రెండు చిత్రాలు కూడా అందుకున్నాయి. ఇంకా రోషన్ సినిమాకి అయితే ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపడే వసూళ్లను తెలుగు ఆడియెన్స్ ఇచ్చారు. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ రెండు సినిమాల రెండు రోజుల నైజాం వసూళ్ల వివరాలు బయటకి వచ్చాయి. అఖిల్ సినిమాకి 1.75 కోట్ల షేర్ ని రాబట్టగా పెళ్లి సందD కి 21 లక్షల రూపాయలు వసూలు అయ్యాయి. ఇక ఈ ఆదివారం కూడా డెఫినెట్ గా ఈ చిత్రాలకు మెరుగైన వసూళ్లు రావడం కన్ఫర్మ్ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు